

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. మార్చి 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొత్త రికార్డులు సృష్టించింది. పుష్ప 2 కలెక్షన్స్‌ను కూడా దాటేసి, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, గత సంవత్సరం డిసెంబర్‌లో వచ్చిన ధురంధర్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది.
థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ సినిమా కోసం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా వచ్చే నెల 14 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కావచ్చని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే థియేటర్లలో విడుదలై నెల రోజులు దాటిన నేపథ్యంలో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించగా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ కీలక పాత్రల్లో కనిపించారు.





.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!