

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అరుదైన నిర్ణయంగా, రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఈసారి రాజధాని హైదరాబాద్కు దూరంగా ములుగు జిల్లా మేడారంలో నిర్వహించనున్నారు. ఈ నెల 18 వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు మేడారంలోని హరిత హోటల్లో కేబినెట్ భేటీ జరగనుంది. సాధారణంగా సచివాలయంలో జరిగే సమావేశాన్ని గిరిజన ప్రాంతమైన మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సమావేశంలో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్షతో పాటు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్, మున్సిపల్ ఎన్నికలు, రైతు భరోసా వంటి ముఖ్య అంశాలపై కూడా చర్చ జరిగే సూచనలు ఉన్నాయి. ఈ కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులకు ఇప్పటికే సమాచారం అందగా, ములుగు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!