

దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం రెండోరోజు బుధవారం భారీ విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో దాదాపు రూ.23 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
డక్టైల్ ఐరన్ పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ రూ.12,500 కోట్లతో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో సుమారు 12 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది. అలాగే స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ రూ.6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
సౌందర్య రంగ దిగ్గజ సంస్థ లోరియల్ హైదరాబాద్లో ప్రపంచంలోనే తొలి బ్యూటీ-టెక్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను రూ.3,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అమెరికాకు చెందిన విమానయాన సంస్థ సర్గాడ్ తెలంగాణలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ ఏర్పాటుకు రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ నెల 23 వరకు కొనసాగనున్న ఈ సదస్సులో మరిన్ని సంస్థలతో తెలంగాణ బృందం చర్చలు జరపనుంది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!