

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలా లేదా అన్న విషయంపై సీబీఐ స్పష్టంగా చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ ఇప్పటివరకు అస్పష్ట వైఖరితో వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించిన ధర్మాసనం, ఇప్పుడు ఏం కావాలో స్పష్టంగా తెలియజేస్తే దాని ప్రకారం ముందుకు వెళ్తామని పేర్కొంది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్లతో కూడిన ధర్మాసనం రెండు వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 5 కు వాయిదా వేసింది.
వివేకానందరెడ్డి హత్యలో విస్తృత కుట్ర కోణంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈ ఆదేశాలు వెలువడ్డాయి. సీబీఐ ప్రత్యేక కోర్టు డిసెంబర్ 10 న కేవలం కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల పాత్రపైనే విచారణకు అనుమతి ఇవ్వడాన్ని ఆమె సవాల్ చేశారు. ఆమె తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, రూ.4 కోట్ల మనీ ట్రయల్, కాల్ డేటా రికార్డులపై లోతైన దర్యాప్తు జరగలేదని పేర్కొన్నారు. అయితే మినీ ట్రయల్ నిర్వహించకుండా, సీబీఐ ఏ అంశాలపై దర్యాప్తు కోరుతోందో స్పష్టంగా చెప్పాలని కోర్టు తెలిపింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!