

ఆరావళి పర్వతాల్లో మైనింగ్ అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన కొన్ని ఉత్తర్వులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి తుది తీర్పు వెలువడే వరకు గతంలో జారీ చేసిన ఆదేశాలు అమల్లో ఉండవని స్పష్టం చేసింది.
100 మీటర్ల లోపు ఎత్తు ఉన్న ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌కు గతంలో అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆరావళి మైనింగ్ అంశంపై అమికస్ క్యూరీని నియమించింది.
అలాగే, పర్యావరణ కార్యదర్శి నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నాలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను (చీఫ్ సెక్రటరీలు) ఈ కమిటీలో సభ్యులుగా చేర్చింది. ఆరావళి పర్వతాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పర్యావరణ ముప్పును నివారించే దిశగా తగిన చర్యలు సూచించాలని కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!