

లాస్ ఏంజెలెస్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని తీవ్ర తుఫాను వణికిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో వరద పరిస్థితి నెలకొంది. దీని ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి.
లాస్ ఏంజెలెస్‌కు ఈశాన్యంగా సుమారు 80 మైళ్ల దూరంలో ఉన్న శాన్ గాబ్రియేల్ పర్వత ప్రాంతంలోని రైట్వుడ్కు వెళ్లే రహదారులు బురదతో నిండిపోయాయి. దీంతో అనేక వాహనాలు అక్కడే చిక్కుకుపోయాయి. అధికారులు రంగంలోకి దిగీ ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పలు కౌంటీల్లో మట్టిచరియలు విరిగిపడటంతో ప్రధాన రహదారులను మూసివేశారు. వరదల కారణంగా సుమారు లక్ష ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద సంబంధిత ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!