
రాజకీయాలు

యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం పొగాకు లేని సమాజాన్ని ఏర్పరచాలనే లక్ష్యంతో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 2008 తర్వాత పుట్టిన వారికి సిగరెట్లు అమ్మకాన్ని నిషేధించేలా కొత్త చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్ తరాలు పొగాకు వల్ల వచ్చే హానికర ప్రభావాల నుంచి రక్షణ పొందాలని భావిస్తున్నారు.
ఈ చర్య వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తగ్గి, మరణాల సంఖ్య కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.యూకే తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ఇది ఇతర దేశాలకు కూడా ఒక మంచి ఉదాహరణగా నిలవొచ్చని అంటున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!