
న్యూస్

ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు ఆదేశించారు. ఈ విచారణను హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఉండగా, సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!