
గాసిప్స్

హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలు కేసులకు సంబంధించిన సీజ్ చేసిన ప్రాపర్టీతో పాటు ఫిజికల్ ఎవిడెన్స్ పూర్తిగా దగ్ధమైంది. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 40 నుంచి 50 కంప్యూటర్లు కాలిపోగా, మరో గదిలో నిల్వ చేసిన హార్డ్ డిస్క్‌లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ మరియు డీఎఫ్‌వో శ్రీదాస్ తెలిపారు. సీజ్ చేసిన ప్రాపర్టీల గది పూర్తిగా దగ్ధమైందని అధికారులు వెల్లడించారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అనంతరం నష్టాల అంచనా ప్రక్రియ కొనసాగుతోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!