
న్యూస్

ప్రముఖ తమిళ నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. చెన్నై తేనాంపేటలోని ఆమె నివాసంతో పాటు బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో బాంబులు ఉన్నట్లు డీజీపీ కార్యాలయం కంట్రోల్ రూమ్‌కు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంబంధిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
బాంబు స్క్వాడ్‌తో కలిసి అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా, ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ బెదిరింపు తప్పుడు సమాచారం (హోక్స్ కాల్)గా భావిస్తున్న పోలీసులు, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!