
గాసిప్స్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం తెలిపింది. నిన్న ఇది తుపానుగా బలపడుతుందని తొలుత అంచనా వేసినా, పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ వ్యవస్థ వాయవ్య దిశగా కదులుతూ ఈ రోజు మధ్యాహ్నానికి శ్రీలంకలో ట్రింకోమలి–జాఫ్నా మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షం కురవొచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా, ఈ రోజు, రేపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!