
రాజకీయాలు

నైరుతి రుతుపవనాలు మరో 2-3 రోజుల్లో కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు మరియు బంగాళాఖాతంలోని మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో రుతుపవనాల పురోగతికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ముందుగా మే 26న రుతుపవనాలు కేరళకు చేరతాయని అంచనా వేసినా, తరువాత ఆ తేదీని సవరించి వచ్చే వారానికి మార్చారు.
అయితే ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అరేబియా సముద్రంలో బలహీన గాలుల కారణంగా రుతుపవనాల ప్రారంభం ఆలస్యమవుతోందని తెలిపారు. కేరళలో నిరంతర వర్షాలు, గాలుల వేగం ఆధారంగా మాత్రమే రుతుపవనాల ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఈ నెల 8 దాటితేనే ఆలస్యంగా వచ్చినట్లు పరిగణిస్తారని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!