

న్యూయార్క్ నగరం సహా ఈశాన్య అమెరికాలో ఈ వీకెండ్ తీవ్రమైన చలి ప్రజలను వణికిస్తోంది. ఆదివారం న్యూయార్క్‌లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పడిపోగా, బలమైన చలిగాలుల కారణంగా అది 14 డిగ్రీలలా అనిపించింది. కొన్ని ప్రాంతాల్లో అయితే చలిగాలి ప్రభావం 40 డిగ్రీల వరకు అనుభూతి చెందేలా ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. కెనడా నుంచి వచ్చిన ఆర్కిటిక్ గాలులే ఈ తీవ్ర పరిస్థితులకు కారణమని, గత 10–20 ఏళ్లలో ఇంతటి చలి చూడలేదని వారు చెప్పారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో న్యూయార్క్, ఫిలడెల్ఫియా వంటి ప్రధాన నగరాల్లో కలిపి 4.3 కోట్ల మందికి పైగా ప్రజలకు తీవ్ర చలి హెచ్చరికలు జారీ చేశారు. న్యూయార్క్ నగరంలో ఈ ఏడాది ఇప్పటివరకు కనీసం 17 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 13 మంది హైపోథర్మియా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆశ్చర్యకరంగా, అంటార్కిటికాలోని మెక్‌మర్డో స్టేషన్లో న్యూయార్క్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్టు నివేదికలు చెబుతున్నాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!