

తిరుపతి జిల్లాలోని నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరగనున్నాయి. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రమే తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి నారా లోకేష్, కుటుంబ సభ్యులు కూడా గ్రామానికి వచ్చారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా నారా–నందమూరి కుటుంబాలు కలిసి మూడు రోజుల పాటు స్వగ్రామంలో ఉండి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోనున్నారు.
ఇవాళ, రేపు గ్రామస్తులు, కార్యకర్తలు, నేతలతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నారావారిపల్లెతో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, కొత్త పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. కొద్దిసేపట్లో గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!