

సంధ్యా 70ఎంఎం థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి, 2025 డిసెంబర్ 24న గౌరవ న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఐపీఎస్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనకు సంబంధించి ప్రణాళిక లోపాలు, గుంపు నియంత్రణ లోపాలు, భద్రతా ఏర్పాట్ల లోపాలు, అలాగే థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది మధ్య సరైన సమన్వయం లేకపోవడం బయటపడింది.
ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో 14 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, ముందస్తు బెయిల్ పొందిన 9 మందికి నోటీసులు జారీ చేశారు. నిందితులలో సంధ్యా 70ఎంఎం థియేటర్ భాగస్వాములు, సిబ్బంది, ఈవెంట్ నిర్వాహకులు, బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అలాగే సినీ నటుడు అల్లు అర్జున్తో పాటు ఆయన మేనేజ్మెంట్, భద్రతా బృందానికి చెందిన సభ్యులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
సంధ్యా 70ఎంఎం థియేటర్ తొక్కిసలాట కేసులో 23 మంది నిందితుల జాబితా:
1.అగమాటి రామ్ రెడ్డి @ పెద్ద రామ్ రెడ్డి – పార్ట్నర్ (ఓనర్)
2.అగమాటి రామ్ రెడ్డి @ చిన్న రామ్ రెడ్డి – పార్ట్నర్
3.ఎం. సందీప్ – పార్ట్నర్
4.ఎం. సుమీత్ @ మిట్టు – పార్ట్నర్
5.అగమాటి వినయ్ కుమార్ – పార్ట్నర్
6.అగమాటి ఆశుతోష్ రెడ్డి – పార్ట్నర్
7.ఎం. రేణుకా దేవి – పార్ట్నర్
8.అగమాటి అరుణా రెడ్డి – పార్ట్నర్
9.ఎం. నాగరాజు – మేనేజర్
10.గంధకం విజయ్ చంద్ర – లోయర్ బాల్కనీ ఇన్చార్జ్, గేట్ కీపర్
11.అల్లు అర్జున్ @ బన్నీ – సినీ నటుడు
12.జోస్య భట్ల సంతోష్ కుమార్ – అల్లు అర్జున్ మేనేజర్
13.శరత్ బన్నీ @ శరత్ చంద్ర నాయుడు – అల్లు అర్జున్ మేనేజర్
14.తాటిపముల వినయ్ కుమార్ @ అర్జున్ కుమార్ – ఫ్యాన్స్ అసోసియేషన్ ఇన్చార్జ్
15.ముహమ్మద్ పర్వేజ్ – సహాయకుడు
16.తల్ల కిరణ్ కుమార్ గౌడ్ @ రాజు – ఈవెంట్ నిర్వాహకుడు / ఎలక్ట్రిషియన్
17.చెరుకు రమేష్ – అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది
18.శ్రీరాముల రాజు – అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది
19.ఇబ్రహీం మొహమ్మద్ ఫిర్దోస్ – బౌన్సర్
20.ఆజం పాషా @ బాబీ – బౌన్సర్
21.డి. మహేష్ – బౌన్సర్
22.రాజ్ ఆంటోని డిమెల్లో @ ఆంటోని – బౌన్సర్
23.పెగ్గాపురం సత్యమూర్తి – బౌన్సర్
ఈ కేసుకు సంబంధించి చట్ట ప్రకారం తదుపరి చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!