

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గుజరాత్‌లో పోటీ చేయాలనుకుంటే ఎవరూ అడ్డుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కోనసీమలో కొబ్బరి చెట్లు కాలిపోవడానికి తెలంగాణ దిష్టి కారణమని గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయని ఆరోపించారు.
బీజేపీ, బీఆర్ఎస్‌కు అనుకూలంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారని అనిరుధ్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీ అని, భవిష్యత్తులో మళ్లీ అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందన్నారు. అమిత్ షాతో చర్చల అనంతరం తెలంగాణలో రెచ్చగొట్టే రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొండగట్టుకు నిధులు ఇచ్చామని విమర్శించే ముందు తెలంగాణ ప్రభుత్వం తిరుపతితో సహా ఇతర ధార్మిక క్షేత్రాలకు కూడా సహకరిస్తోందని గుర్తు చేశారు. ఇంగ్లీష్‌లో మాట్లాడటం ద్వారా ఎవరిని ఆకట్టుకోవాలనుకున్నారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించిన ఆయన, జన్వాడ ప్రాంతంలోని భూములకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!