

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో తన రాజకీయ పరిస్థితి ఏంటో పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పుకున్నారని, అలాంటప్పుడు తెలంగాణలో ఆయనకు ఏమి ప్రాధాన్యం ఉందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణలో ఉండకూడదని లేదా ఇక్కడ పెట్టుబడులు పెట్టకూడదని తాము ఎప్పుడూ చెప్పలేదని, విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులను ఎందుకు నిరాకరిస్తుందని అన్నారు.
గద్దర్‌కు కారు కొనిచ్చానని పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పడం తప్పని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై పవన్ గద్దర్ కుటుంబానికి, అభిమానులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణను పదేపదే పాకిస్థాన్‌తో పోల్చి అవమానిస్తున్నారని ఆరోపిస్తూ, తెలంగాణ అమరవీరుల త్యాగాలకు పవన్ ఎప్పుడైనా మద్దతు ఇచ్చారా అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కొండగట్టు పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు ముఖ్య అతిథి స్థాయిలో స్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ఆలయ అభివృద్ధికి కేటాయించిన నిధులు ప్రజలవేనని, ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే సభ నిర్వహించి అనవసర వివాదాలకు తెరలేపారని విమర్శించిన ఆయన, తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!