
గాసిప్స్

సమ్మక్క–సారక్క జాతర–2026 సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హూండీల లెక్కింపు ప్రక్రియను హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ప్రారంభించారు. దేవాదాయ శాఖ అధికారులు, సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. జాతర కోసం మొత్తం 828 హూండీలను ఏర్పాటు చేయగా, వాటిలో 780 ఇనుప హూండీలు, 45 వస్త్ర హూండీలు, 3 బియ్యం హూండీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
తొలి రోజు 125 హూండీలను తెరిచి లెక్కించగా రూ.2,49,65,000 ఆదాయం లభించినట్లు తెలిపారు. లెక్కించిన నగదును పర్యవేక్షణాధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులకు అప్పగించారు. బంగారం, వెండి కానుకలను వేర్వేరుగా భద్రపరిచి తాళాలు వేసి ఉంచామని, నాణేల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు స్పష్టం చేశారు. మిగిలిన హూండీల లెక్కింపును దశలవారీగా పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ తెలిపింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!