
న్యూస్

ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 42 పైసలు తగ్గి రూ.91.49 వద్ద ముగిసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, యూఎస్ డాలర్‌కు డిమాండ్ అధికమవడం రూపాయి బలహీనతకు ప్రధాన కారణాలుగా ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు నమోదవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కూడా రూపాయి పై అదనపు ఒత్తిడిని సృష్టించాయి.
ముందున్న రోజుల్లో కూడా కరెన్సీ పై ఒత్తిడి కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. రూపాయి మారకం విలువ రూ.91.10 నుంచి రూ.91.80 మధ్య కదలాడే అవకాశముందని అంచనా వేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!