

వినోద పరిశ్రమలో కావలసిన శరీరాకృతి కోసం తాను తనను తాను హింసించుకున్నానని కథానాయిక తాప్సి పన్ను వెల్లడించింది. అందమైన శరీరాకృతి కోసం ఆరోగ్యకరమైన పరిమితులను దాటి ప్రవర్తించానని, అయితే ఇప్పుడు సహజ శరీర మార్పులను అంగీకరించడం ముఖ్యమని గ్రహించానని తెలిపింది. సోషల్ మీడియాలో కనిపించే అందాల కోసం మహిళలు తమను తాము హింసించుకోవద్దని ఆమె సూచించింది.
ఇన్‌స్టా స్టోరీలో తాప్సి మాట్లాడుతూ, తాను ఒకప్పుడు అతిగా వ్యాయామం చేసేదాన్ని, శరీర సామర్థ్యానికి మించి పనిచేసేదాన్ని అని తెలిపింది. కానీ శరీరం ఎప్పుడైనా విశ్రాంతి అవసరమని సంకేతాలు ఇస్తుందని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. అతిగా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ ఇతరుల్లా ఉండలేరని అంగీకరించాలని ఆమె సూచించింది. ఇటీవల ‘అస్సీ’ సినిమాలో కనిపించిన తాప్సి, త్వరలో ‘గాంధారి’ చిత్రంలో నటించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!