
బిజినెస్

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, తన తండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత రెండు రోజుల పాటు ఆయనతో మాట్లాడలేదని వెల్లడించారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇంటికి రాకుండా, తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలను కలవడానికి వెళ్లారని ఆమె తెలిపారు.
వేలాది మంది కార్యకర్తలు ఆహారం, చెప్పులు లేకుండా ఆయన కోసం వేచి ఉన్నారని గుర్తుచేసిన డీకే శివకుమార్, ముందుగా వారిని కలవాలని నిర్ణయించుకున్నారని ఆమె చెప్పారు. ఆ తర్వాతే తాను తండ్రితో మాట్లాడినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, అది ప్రస్తుతం వైరల్గా మారింది. నాలుగు దశాబ్దాల పాటు పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!