
బిజినెస్

నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ నుంచి ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్‌తో పాటు ప్రత్యేక వీడియో విడుదల చేశారు. భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. నభా నటేశ్, సంయుక్త కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ వీడియోలో వియత్నాంలో నిఖిల్ తీసుకున్న కత్తియుద్ధం, సాఫ్ట్ కాంబాట్, మార్షల్ ఆర్ట్స్ శిక్షణను చూపించారు. చారిత్రక అంశాలతో కూడిన ఈ యాక్షన్ డ్రామాలో నిఖిల్ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. సంగీతం రవి బస్రూర్, ఛాయాగ్రహణం కె.కె. సెంథిల్ కుమార్ అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!