

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారత సినీ చరిత్రలో తొలి మ్యూజికల్ కామెడీ ఫిల్మ్‌గా నిలుస్తుందని నటి తెలిపారు. ఈ కథ పూర్తిగా ‘కుబేరపురం’ అనే కల్పిత గ్రామంలో జరుగుతుందని, అక్కడి ప్రజలు పాటల రూపంలోనే మాట్లాడతారని చెప్పారు. ఆ గ్రామంలోని రహస్యమేంటి, అక్కడి ప్రజలు ఎందుకు ఇలా మాట్లాడుతారు అన్నది సినిమా కథలో ప్రధాన ఆకర్షణగా ఉంటుందని తెలిపారు. ఈ కథ చాలా ఏళ్ల క్రితమే రాసినా ఇప్పటికీ ఎంతో ప్రాసంగికంగా ఉందని ఆమె అన్నారు.
సింగీతం చిత్రాల్లో ప్రతి పాత్రకూ ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని, ఇందులో తన ప్రతినాయిక పాత్ర కూడా బలంగా రూపుదిద్దుకుందని నటి పేర్కొన్నారు. అనేక కోణాలు ఉన్న ఈ పాత్ర వినోదాత్మకంగా ఉంటూనే కథలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇలాంటి అవకాశం అందరికీ రాదని, తాను ఈ సినిమాను ప్రేక్షకురాలిగా కూడా ఎంతో ఆస్వాదించానని తెలిపారు. మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్న తాను త్వరలో దర్శకత్వంలో కామెడీ సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!