

కఠిన వీసా విధానాలపై అమెరికా మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. వీసా అనేది హక్కు కాదని, అది కేవలం దేశంలోకి ప్రవేశించేందుకు ఇచ్చే అనుమతి మాత్రమేనని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. విదేశీ పర్యాటకులు, విద్యార్థులు, జర్నలిస్టులు సహా ఎవరికైనా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారి వీసాను రద్దు చేస్తామని హెచ్చరించారు. గడిచిన ఏడాదిలో అనేక వీసాలను రద్దు చేసినట్లు తెలిపారు.
హంగేరియన్ ప్రధానితో భేటీ సందర్భంగా రూబియో ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. టూరిస్టుల ముసుగులో అమెరికాలోకి ప్రవేశించి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా వీసా జారీ విధానాన్ని మరింత కఠినతరం చేసి, పలు దేశాలకు వీసా సేవలను నిలిపివేసింది. ఈ జాబితాలో ఉన్న దేశాల సంఖ్య 75కు చేరుకుంది. ఆయా దేశాల నుంచి వలసలు అమెరికన్ల ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!