
ఆరోగ్యం

హైదరాబాద్‌లో రూ.26 వేలకే కారు అంటూ సోషల్ మీడియాలో మోసం జరిగిన ఘటన కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తక్కువ ధరకే కారు ఇస్తామని ప్రచారం చేయడంతో మల్లాపూర్‌లోని ట్రస్ట్ కార్స్ షోరూం వద్ద పెద్ద సంఖ్యలో జనం చేరారు. మొదట ఆఫర్ నిజమేనని నమ్మిన ప్రజలు షోరూం వద్దకు వచ్చారు.
తరువాత ఇది మోసమని తెలిసిన వెంటనే ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది. షోరూం వద్ద కార్లపై రాళ్లతో దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులను నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!