

అమెరికాలో భారతీయులపై జాత్యహంకార ద్వేషం వేగంగా పెరుగుతోంది. ఇటీవల FBI డైరెక్టర్ కాష్ పటేల్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేయగా, కుడితర తీవ్రవాదులు అతనిపై తీవ్రమైన ద్వేష వ్యాఖ్యలు చేశారు. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటి భారత వంశీయ నాయకులు కూడా ఇదే తరహా దాడులకు గురయ్యారు. కూడా వైట్ హౌస్ లేదా గవర్నర్ల దీపావళి పోస్టులకే కూడా ద్వేష స్పందనలు రావడం, ఈ సమస్య ఎంత లోతుగా పెరిగిందో చూపిస్తుంది. ఈ ద్వేషానికి ముఖ్య కారణాల్లో ఒకటి H-1B వీసా వ్యవస్థ. ఈ వీసాలు పొందేవారిలో భారతీయులే అత్యధికులు కావడంతో, “ఇండియన్స్ అమెరికన్ల ఉద్యోగాలు దోచుకుంటున్నారు”, “సిస్టమ్‌ని వాడేసుకుంటున్నారు” అనే ప్రపగాండాను కుడితర వర్గాలు పెంచుతున్నాయి. భారతీయుల గురించి “అస్వచ్ఛులు”, “వెనుకబడి ఉన్న సంస్కృతి” వంటి తప్పుడు స్టీరియోటైపులను కూడా వ్యాప్తి చేస్తూ ఆన్లైన్లో తీవ్ర ద్వేష ప్రచారం నడిపిస్తున్నారు.
ఇండియా లేదా భారతీయులు ఏ విషయంలో వార్తల్లోకి వచ్చినా—పాలిటికల్ పోస్టింగ్స్, ట్రేడ్ వివాదాలు లేదా చిన్నచిన్న సంఘటనలు అయినా—అవే వేళలలో ద్వేష వేవ్స్ సోషల్ మీడియాలో రావడం అలవాటైంది. ఈ ఆన్లైన్ ద్వేషం ఇప్పుడు ఆఫ్‌లైన్‌లోకి కూడా చేరుతోంది. ఫ్లోరిడాలో ఒక కౌన్సిల్ మెంబర్ ఇండియన్స్‌పై తీవ్ర అవమానకర వ్యాఖ్యలు చేశాడు. టెక్సాస్‌లో నిరసనకారులు “ఇండియన్స్ గో బాక్” అని ప్లకార్డులు పట్టి నిలబడ్డారు. ఇటీవల డల్లాస్‌లో ఒక భారతీయుడు జాత్యహంకార కారణంగా హత్యకు గురైన ఘటనతో భారతీయ కమ్యూనిటీలో ఆందోళన పెరిగింది. నిపుణుల హెచ్చరిక ప్రకారం, ప్రస్తుతం అమెరికాలో నివసించే భారతీయులు పెద్దగా పబ్లిక్ ఈవెంట్స్, భారీ ర్యాలీలు, ధార్మిక ప్రదర్శనలు చేయకుండా లో-ప్రొఫైల్‌గా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!