

ఆంధ్రప్రదేశ్లో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాల ప్రకారం, ఈ రోజు రాష్ట్రంలోని పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా 19 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండగా, మరో 21 మండలాల్లో సాధారణ వడగాలులు ఉంటాయని తెలిపారు.
విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, రామభద్రాపురం, తెర్లాం, వంగర మండలాల్లో తీవ్ర వడగాలులు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో కూడా తీవ్ర ప్రభావం ఉండవచ్చని తెలిపారు.
ఇటీవల ప్రకాశం జిల్లాలోని కంభంలో 45.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 20 జిల్లాల పరిధిలోని 227 మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు.





.jpeg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!