

ప్రతిష్టాత్మక ఉబెర్ కప్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు కీలక విజయం సాధించింది. గ్రూప్-ఎలో రెండో మ్యాచ్‌లో ఉక్రెయిన్ను 4-1తో ఓడించి క్వార్టర్ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మొదటి మ్యాచ్‌లో డెన్మార్క్ చేతిలో ఓడిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో గట్టి పునరాగమనం చేసింది. స్టార్ క్రీడాకారిణి పి.వి. సింధు సింగిల్స్‌కు విశ్రాంతి తీసుకుని డబుల్స్‌లో ఆడింది. యువ క్రీడాకారిణులు ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవికా సిహాగ్ సింగిల్స్‌లో విజయాలు సాధించారు. ఒక డబుల్స్‌లో ఓటమి వచ్చినప్పటికీ, సింధు-తనీషా క్రాస్టో జోడీ గెలిచి భారత్‌కు 4-1 విజయాన్ని అందించింది. తదుపరి మ్యాచ్‌లో చైనాతో తలపడనుంది.
అథ్లెటిక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొగలి వెంకట్రామ్ జాతీయ అండర్-20 అథ్లెటిక్స్ జూనియర్ ఫెడరేషన్ కప్‌లో స్వర్ణం గెలుచుకుని కొత్త మీట్ రికార్డు సృష్టించాడు. పురుషుల 800 మీటర్ల ఫైనల్లో 1:49.02 సెకన్లలో రేసును పూర్తి చేసి, 2022లో ప్రదీప్ సెంథిల్ నెలకొల్పిన 1:49.59 రికార్డును అధిగమించాడు. ఈ విజయం భారత అథ్లెటిక్స్ భవిష్యత్తుకు కొత్త ఆశలను నింపింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!