
న్యూస్

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బస్ డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పెద్దపల్లి లో 150 బస్సులు డిపోనకే పరిమితం కాగా, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కార్మికులు నిరసన చేపట్టారు. మహబూబ్‌నగర్ లో 112 బస్సులు నిలిచిపోగా, ప్రయాణికుల కోసం 16 ఎలక్ట్రిక్ బస్సులను అధికారులు నడుపుతున్నారు. మరోవైపు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ, సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొన్ని సంఘాలు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!