

తెలంగాణ రాష్ట్రంలో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేయర్, చైర్మన్ పదవుల రిజర్వేషన్లను కమిషనర్ శ్రీదేవి అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 10 మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లు నిర్ణయించగా, కొత్తగూడెం ST జనరల్, రామగుండం SC జనరల్‌గా ఖరారు చేశారు. మంచిర్యాల, కరీంనగర్ BC జనరల్‌కు, మహబూబ్‌నగర్ BC మహిళకు కేటాయించారు. హైదరాబాద్ GHMC, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ మేయర్ స్థానాలను జనరల్ మహిళలకు కేటాయించగా, గ్రేటర్ వరంగల్ జనరల్‌కు కేటాయించారు.
అలాగే రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల చైర్మన్ పదవుల రిజర్వేషన్లను కూడా ఖరారు చేశారు. వీటిలో 2 ST మహిళ, 3 ST జనరల్, 8 SC మహిళ, 9 SC జనరల్, 19 BC మహిళ, 19 BC జనరల్, 31 జనరల్ మహిళ, 30 జనరల్ కేటగిరీలుగా ప్రకటించారు. ఖరారు చేసిన మేయర్, చైర్మన్, వార్డుల వారీ రిజర్వేషన్ల వివరాలను శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేస్తామని కమిషనర్ శ్రీదేవి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!