

నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నారు. దట్టమైన పొగ మరియు అధిక వేడి కారణంగా సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. సెల్లార్లోకి చేరుకునేందుకు గుంతలు తవ్వుతూ లోపలికి వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రాత్రంతా నిర్విరామంగా ప్రయత్నించినప్పటికీ, దాదాపు 18 గంటలు గడిచినా ఐదుగురి ఆచూకీ ఇంకా లభించలేదు. రెస్క్యూ బృందాలు లోపలికి ప్రవేశించి బాధితులను స్ట్రెచర్ల ద్వారా బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఘటన స్థలంలో అంబులెన్స్‌లను అధికారులు సిద్ధంగా ఉంచారు.
సెల్లార్లకు రంధ్రాలు పడి పొగ బయటకు వస్తోంది. భవనం దృఢత్వంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ నిపుణుల బృందం ఘటన స్థలాన్ని పరిశీలించి నివేదిక అందించనుంది, తద్వారా భవనం సురక్షితంగా ఉందా లేదా అనే విషయం నిర్ణయించబడుతుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!