
న్యూస్

ఏపీ: తుఫాను కారణంగా పంటలు కోల్పోయిన రాష్ట్రంలోని రైతులకు పెద్ద ఊరట లభించింది. నష్టపరిహారాన్ని హెక్టారుకు ₹17వేల నుండి ₹25వేలకు పెంచుతున్నట్లు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అరటి పంటలకు అదనంగా ₹10వేలు కలిపి అందించనున్నట్లు ఆయన తెలిపారు. దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు ₹1,500 చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టంపై అంచనా ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఈరోజు (నవంబర్ 11) నాటికి 100% అంచనాలు సిద్ధమవుతాయని మంత్రి తెలిపారు. రైతులకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత రైతుల పట్ల ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!