

రిలయన్స్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి బాగా ఆసక్తి చూపుతోందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ఈ విషయంపై ఒప్పందం కుదిరింది. రిలయన్స్‌కు చెందిన వంతారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, వైల్డ్‌లైఫ్ కన్జర్వేటరీ, నైట్ సఫారీ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ పర్యాటక రంగం పూర్తిగా మారిపోయి, ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాల అడవి ప్రదేశానికి కేటాయించినందున, అక్కడే వంతారా సెంటర్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉందని అంచనా. అది సాధ్యం కాకపోతే, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ప్రాజెక్టు అమలు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే గుజరాత్లో ఏర్పాటు చేసిన వంతారా అభయారణ్యం ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన పేరు సంపాదించింది. ఇది జంతువుల రక్షణకు మార్గదర్శకంగా నిలుస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!