

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అమెరికాలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. టెక్సాస్ రాష్ట్రంలోని బ్రౌన్స్‌విల్లే ప్రాంతంలో భారీ చమురు శుద్ధి కేంద్రం నిర్మాణంలో రిలయన్స్ భాగస్వామ్యం ఉండనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం విలువ 300 బిలియన్ డాలర్లు అని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో పోస్టు చేస్తూ వెల్లడించారు.
దాదాపు 50 సంవత్సరాల తర్వాత అమెరికాలో కొత్త చమురు శుద్ధి కేంద్రం నిర్మాణం జరగడం విశేషమని ట్రంప్ పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని, టెక్సాస్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం లభిస్తుందని ఆయన తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు భారత భాగస్వాములకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రిఫైనరీ ద్వారా అమెరికా ఇంధన ఉత్పత్తి పెరిగి, ఎగుమతులు కూడా పెరిగే అవకాశముందని, ఇది ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!