

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రహదారి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. శంషాబాద్–షాబాద్ మధ్య కొత్త రహదారి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. షాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి కోసం ఈ రహదారి కీలకంగా మారనుంది. ఇది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను పరిశ్రమ ప్రాంతాలతో అనుసంధానం చేయనుంది. అలాగే బుద్వేల్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రారంభమయ్యే 81 కి.మీ రేడియల్ రోడ్-2లో భాగంగా ఈ ప్రాజెక్టు కొనసాగనుంది.
రేడియల్ రోడ్-2 బుద్వేల్ నుంచి షాబాద్, పూడూరు మీదుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ వరకు విస్తరించనుంది. ఈ ప్రాజెక్టుతో శంషాబాద్, షాబాద్ ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధి వేగవంతమవుతుందని అంచనా వేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి పరిశ్రమలకు సరుకు రవాణా సులభతరం కావడంతో పాటు ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా పెరగనున్నాయి. షాబాద్ మండలంలో ఇప్పటికే 300 ఎకరాల భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. భూములు ఇచ్చిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించనున్నారు. ఈ ప్రాజెక్టుతో ప్రాంత రూపురేఖలు మారనున్నాయి.

.jpg&w=3840&q=75)









.jpg&w=3840&q=75)








.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!