
టెక్నాలజీ

బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని, తాను ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుని విజయవంతంగా కోలుకున్నట్లు వెల్లడించారు. యుద్ధ పరిస్థితుల మధ్య తన ఆరోగ్య విషయాన్ని బయటపెడితే తప్పుడు ప్రచారం జరిగే అవకాశం ఉందని భావించి దీనిని గోప్యంగా ఉంచినట్లు తెలిపారు.
ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం వల్ల సర్జరీ విజయవంతమైందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానన్నారు. చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అయితే, వ్యక్తిగత ఆరోగ్యంపై చూపిన జాగ్రత్తలాగే ప్రపంచాన్ని కలవరపెట్టిన యుద్ధ ఉద్రిక్తతల విషయంలోనూ అదే జాగ్రత్త అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







.png&w=3840&q=75)













.png&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!