
గాసిప్స్

తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. విచారణలో భాగంగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం జరిగిన విచారణలో రవి తన పాత్రపై స్పందిస్తూ, తాను వెబ్ పోర్టల్స్‌కు కేవలం సేవలు మాత్రమే అందించానని పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
ఈ పనిని ఇతర ఉద్యోగాల మాదిరిగానే ఎంచుకున్నానని రవి పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, గత ఆరు సంవత్సరాలుగా ఐబొమ్మ, బప్పం టీవీ వంటి వెబ్ పోర్టల్స్‌లో సుమారు 21 వేల సినిమాలను పైరసీ చేసి అప్లోడ్ చేసినట్లు పోలీసులు నిర్ధారించినట్లు వెల్లడించారు. ఈ భారీ పైరసీ నెట్‌వర్క్‌పై విచారణ ఇంకా కొనసాగుతోంది.





.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!