
గాసిప్స్

సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. పండుగ రెండో రోజైన గురువారం తాడేపల్లిగూడెం పరిధిలో జరిగిన భారీ కోడిపందెం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఒక్క పందెంలోనే గెలిచిన వ్యక్తికి ఏకంగా రూ.1.53 కోట్లు దక్కినట్లు సమాచారం.
వివరాల ప్రకారం, తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో గుడివాడకు చెందిన ప్రభాకర్, రాజమండ్రికి చెందిన రమేశ్‌ల కోళ్ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో రాజమండ్రి రమేశ్‌కు చెందిన కోడి విజయం సాధించడంతో ఆయన రూ.1.53 కోట్ల పందెం సొమ్మును గెలుచుకున్నారు. ఈ సంక్రాంతికి పశ్చిమగోదావరి జిల్లాలో ఇదే అతిపెద్ద కోడి పందెంగా స్థానికులు పేర్కొంటున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!