
టెక్నాలజీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరుగుతున్న DCC అధ్యక్షుల శిక్షణా కార్యక్రమానికి హాజరై, పార్టీ కార్యకర్తలకు మార్గదర్శనం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహాలు మరియు ప్రాంతీయ స్థాయిలో పార్టీ బలాన్ని పెంచే చర్యలపై సూచనలు ఇవ్వనున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో కూడా భేటీ కావచ్చని సమాచారం.
ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులను కూడా రాహుల్ గాంధీ కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన పర్యటనతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!