

ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఖతార్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ యుద్ధ పరిస్థితులు మరో రెండు వారాలు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 150 డాలర్ల వరకు చేరవచ్చని హెచ్చరించింది.
చమురు ధరలు ఈ స్థాయికి పెరిగితే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని ఖతార్ ప్రభుత్వం పేర్కొంది. ఇంధన ధరలు పెరగడం వల్ల అనేక దేశాల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని కూడా సూచించింది.
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే యుద్ధం త్వరగా ముగియాలని మరియు పరిస్థితులు శాంతియుతంగా మారాలని అనేక దేశాలు కోరుతున్నాయి.









.jpeg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!