
రాజకీయాలు

‘పెద్ది’ సినిమా ప్రమోషన్లలో ఇప్పటివరకు జాన్వీ కపూర్ కేవలం “చికిరి చికిరి” పాటలో మాత్రమే కనిపించింది. ఆ పాటలో రామ్ చరణ్ డాన్స్ హైలైట్ కావడంతో జాన్వీ పాత్ర పెద్దగా కనిపించలేదు. ఇటీవల విడుదలైన “రైరై రారా” పాట సోలో నంబర్ కావడంతో ఆమెకు అవకాశం లేకపోయింది.
ఇన్‌సైడ్ సమాచారం ప్రకారం సినిమాలో జాన్వీ, రామ్ చరణ్ మధ్య ఒక మెలోడీ డ్యూయెట్ మాత్రమే ఉంటుందని, పెద్ద డాన్స్ సీక్వెన్స్‌లు లేవని తెలుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు వారి కెమిస్ట్రీని ప్రత్యేకంగా డిజైన్ చేశారని, జాన్వీ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ రెండో భాగంలో బయటపడుతుందని అంటున్నారు. సినిమా విడుదలను జూన్ 4 కు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!