

గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉగ్ర ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసిన వేళ, పంజాబ్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా నిషేధిత ఉగ్రసంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన ఉగ్ర మాడ్యూల్‌ను గుర్తించి ఆరుగురిని అరెస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున పెద్దఎత్తున భయాందోళనలు సృష్టించేందుకు ఈ కుట్ర పన్నినట్లు పంజాబ్ డీజీపీ వెల్లడించారు.
నిందితుల వద్ద నుంచి 2.5 కిలోల ఆర్డీఎక్స్తో తయారైన ఐఈడీ, రెండు తుపాకులు, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్ర మాడ్యూల్‌ను అమెరికాలో ఉన్న బీకేఐ హ్యాండ్లర్లు నడిపిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై హోషియార్పూర్ జిల్లా గర్శంకర్ పోలీస్ స్టేషన్లో చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!