
న్యూస్
.jpg&w=3840&q=75)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ శుభవార్త ప్రకటించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీ ప్రయోజనం పొందాలంటే ఈ నెల 31వ తేదీలోగా బకాయిలను చెల్లించాలని అధికారులు తెలిపారు.
పన్ను బకాయిలను అధికారిక వెబ్సైట్, మై జీహెచ్ఎంసీ యాప్, మీ సేవ కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్ల ద్వారా చెల్లించవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా నగరంలోని పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు పెండింగ్ బకాయిల వసూలు వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.

















.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!