

కాంతారను తలపించే విధంగా హిమాచల్ ప్రదేశ్లోని ఒక పవిత్ర అడవిని రింగు నాగ్ అనే నాగదేవత రక్షిస్తోందని స్థానికులు నమ్ముతున్నారు. కుల్లూ జిల్లా సైంజ్ లోయలోని బంజార్ ప్రాంతంలో సుమారు 62 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అడవిని ‘రింగు వన్’గా పిలుస్తారు. ఈ వనంలోకి ప్రవేశించడం, చెట్లు నరుకడం, నిప్పు వెలిగించడం పూర్తిగా నిషేధం. గ్రామ మండళ్ల అనుమతి లేకుండా అటవీశాఖ అధికారులు కూడా అడుగు పెట్టలేరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అడవి బయట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
అటవీ మాఫియా వల్ల చుట్టుపక్కల కొండలు ఎండిపోయినా, రింగు వన్ మాత్రం ఇప్పటికీ పచ్చదనంతో కళకళలాడుతోంది. ఈ విశేషాన్ని గతంలో యునెస్కో బృందం కూడా గుర్తించింది. కుల్లూ దసరా ఉత్సవాల్లో రింగు నాగ్ దేవత రథం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ దేవత పాము, సింహం, పొట్టేలు రూపాల్లో దర్శనమిస్తుందని విశ్వాసం. పూజారి రమేష్ చంద్ తెలిపిన ప్రకారం, సజ వైశాఖ మరియు నాగ పంచమి రోజుల్లో మాత్రమే భక్తులు ఉపవాసంతో ఈ అడవిలోకి ప్రవేశిస్తారు.

















.webp&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!