
గాసిప్స్

తూర్పు గోదావరి జిల్లాలోని కోవూరు బ్రిడ్జి సమీపంలో ఈ రోజు వేకువజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్ఆర్ఆర్ ట్రావెల్స్ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సులో ఉన్న పది మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!