
న్యూస్

ప్రధాని నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో టెలిఫోన్ ద్వారా మాట్లాడి యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో యూఏఈకు భారత్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడం అత్యవసరమని ప్రధాని పేర్కొన్నారు. పశ్చిమ ఆసియాలో శాంతి, భద్రత, స్థిరత్వం కొనసాగేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రాంతీయ సమతుల్యతను కాపాడే ప్రతి ప్రయత్నానికి భారత్ మద్దతు కొనసాగిస్తుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!