

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు అవార్డులు ప్రదానం చేశారు. ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు వంటి ఆరు విభాగాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి ఈ పురస్కారాలు అందించారు.
అవార్డులు అందుకున్న పిల్లలు మరియు వారి తల్లిదండ్రులను రాష్ట్రపతి అభినందించారు. చిన్నారుల సాహసాలు, విజ్ఞానం దేశానికి గర్వకారణమని ఆమె ప్రశంసించారు. ఈ అవార్డులు దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ స్ఫూర్తినిస్తాయని రాష్ట్రపతి ముర్ము విశ్వాసం వ్యక్తం చేశారు. అవార్డు గ్రహీతల్లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఆగ్రాకు చెందిన అజయ్ రాజ్, పంజాబ్‌కు చెందిన శవన్ సింగ్, మహారాష్ట్రకు చెందిన అర్ణవ్ అనుప్రియ మహర్షి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శివాని తదితరులు ఉన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!