
గాసిప్స్

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు బీహార్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజ్‌గిర్‌లోని నలంద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశముంది.
ఇక రేపు రాష్ట్రపతి కర్నాటకలో పర్యటించనున్నారు. తుమకూరులో నిర్వహించే శివకుమార మహాస్వామీజీ జయంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు, గురువందన కార్యక్రమంలో కూడా ఆమె హాజరుకానున్నారు. ఈ పర్యటనలు రాష్ట్రపతి కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించబడుతున్నాయి.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!