

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల చెర్రీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌లో ఆయన రెజ్లర్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీపై టాలీవుడ్లో ఇంకా అనిశ్చితి నెలకొంది. మరోసారి వాయిదా పడుతుందనే ప్రచారం వినిపించగా, నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు ఈ గందరగోళాన్ని మరింత పెంచాయి.
చెన్నై లవ్ స్టోరీ సాంగ్ ఈవెంట్ సందర్భంగా సినిమా విడుదల తేదీపై చర్చ జరిగినట్లు ఎస్కేఎన్ తెలిపారు. ఆ సందర్భంలో సాయి రాజేశ్ జూన్ 25న ‘పెద్ది’ విడుదల కావచ్చని చెప్పడంతో, అక్కడే రిలీజ్ డేట్ ప్రకటించారని తాను తప్పుగా భావించానని ఆయన చెప్పారు. అయితే తన వ్యాఖ్యలు అపార్థానికి దారితీసినందుకు క్షమాపణలు తెలుపుతూ, సినిమా వాయిదా విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, రామ్ చరణ్–బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం, అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెల 30న థియేటర్లలో విడుదలయ్యే అవకాశముంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!