

తమిళనాడు ఎన్నికల సమయంలో నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్‌పై ఎన్నికల నియమాల ఉల్లంఘన ఆరోపణలతో కేసు నమోదు అయింది. చెన్నైలోని పెరవల్లూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేశారు. మానిటరింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం విజయ్ రోడ్‌షోలో సుమారు 30 లౌడ్‌స్పీకర్లు వినియోగించడం, 5000 మందికి పైగా జనాన్ని సమీకరించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని కూడా పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయ్‌తో పాటు సుమారు ఐదు వేల మంది పార్టీ కార్యకర్తలపై కూడా చర్యలు తీసుకున్నారు. నిన్న పెరంబూర్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన సమయంలో నిర్వహించిన రోడ్‌షోలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఇక పోలీసులు సరైన భద్రత కల్పించలేదని, ట్రాఫిక్‌ను నియంత్రించలేదని విజయ్ పార్టీ నాయకులు ఆరోపించారు. భవిష్యత్ ప్రచార కార్యక్రమాలకు భద్రత కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. విజయ్ పెరంబూర్ మరియు త్రిచీ ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. వచ్చే నెల 23వ తేదీన పోలింగ్ జరగగా, మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!